వైసిపిని మరోమారు ఆదరించండి :’చింతల’

ప్రజాశక్తి-కలికిరి వైసిపి ప్రభుత్వాన్ని మరోమారు ఆదరించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపిటిసి బోగేష్‌ సొంత నిధులతో ఏర్పాటు చేసిన బొలెరో ఎన్నికల ప్రచార వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల అమలు చేసిన ఘనత సిఎందేనని కొనియాడారు. రాబోయే వైసిపిని గెలిపించాలని కోరారు. నవర త్నాల పథ కంలో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.కులం, మతం, భేదం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. సంక్షేమ పాలన కోసం జగన్‌ను మరల ముఖ్యమంత్రిని చేసుకుందామని పేర్కొన్నారు. రామ చంద్రారెడ్డిని మరల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నాయకులు, కార్య కర్తలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి బోగేష్‌, నాయ కులు మాజీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ నల్లరి తిమ్మారెడ్డి, గుట్టపాలెం సర్పంచ్‌ రెడ్డివారి వెంకట్‌రెడ్డి, శివయోగ శివాజీ, జిల్లా ఎస్‌సి సెల్‌ కార్యదర్శి హారి, మైనార్టీ యువనాయకులు వేంపల్లి బావాజీ, హనీఫ్‌, వార్డు మెంబర్‌ ఖాదర వల్లి, మద్దిరాల మల్లికార్జున, నాగేంద్ర, మధురెడ్డి, వార్డ్‌ మెంబర్‌ ఖాదరవల్లి, వైస్‌ ఎంపిపి శ్రీకాంత్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

➡️