వైసిపి పాలనలో అందరికీ అన్యాయం

Dec 28,2023 21:45

ప్రజాశక్తి-పాచిపెంట : రాష్ట్రంలో వైసిపి పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయమే జరుగుతోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. మండలంలోని రాయిగుడ్డివలస పంచాయతీలోని పలు గ్రామాల్లో గురువారం బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యుడి జీవనం కష్టతరంగా మారిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు. రానున్న రోజుల్లో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్‌బాబు, ముఖి సూర్యనారాయణ, పల్లేడ ఉమామహేశ్వరరావు, కొత్తల పోలినాయుడు, కె.సురేష్‌, పి.నరిసింగరావు, దండి మోహన్‌ రావు, పల్లేడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : మండలంలో శంభాం పంచాయతీ పరిధిలో జిల్లేడుపాడు గ్రామంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ వాడుకునే వదిలేయడం జగన్‌ రెడ్డి నైజమని, సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణమని విమర్శించారు. విశ్వనీయత లేని వ్యక్తి జగన్‌ రెడ్డి అని, వైసిపి 57 నెలల పాలనలో ప్రజలకు ఈ విషయం స్పష్టమైందని తెలిపారు. ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సవర తోట మొఖలింగం, సీనియర్‌ నాయుకులు నిమ్మక నాగేశ్వరావు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి నిమ్మక చంద్రశేఖర్‌, ప్రచారకర్త తోయిక సంధ్యారాణి, నిమ్మక చిన్నారావు, అరిక భూషణ్‌, వార్డ్‌ సభ్యులు కుండంగి బుల్లయ్య, పాలక ఆదినారాయణ, కుంబిరిక రామారావు, పాలక లక్ష్మణ్‌ పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : వైసిపి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందని, టిడిపి అధికారంలోకి రావాలని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర తెలిపారు. బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం వైకెఎం కాలనీలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తమ పార్టీకి ప్రజల్లో ఎనలేని ఆదరణ లభిస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు బార్నాల సీతారాం, కోల సత్యనారాయణ, కోరాడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

➡️