వైసిపి పాలనలో మైనారిటీలకు అన్యాయం : టిడిపి

Feb 24,2024 19:05
మాట్లాడుతున్న టిడిపి నాయకులు

మాట్లాడుతున్న టిడిపి నాయకులు
వైసిపి పాలనలో మైనారిటీలకు అన్యాయం : టిడిపి
ప్రజాశక్తి -పొదలకూరు :మైనారిటీలకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని టిడిపి నాయకులు పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, షేక్‌. అమిర్‌ భాష, తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ మైనారిటీ సెల్‌ ఉపాధ్యాక్షుడు షేక్‌. జమీర్‌ బాషా, పొదలకూరు మండల టిడిపి మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌. ఖాదర్‌ బాషా మాట్లాడారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు మైనారిటీలకు దుల్హన్‌ పథకం, ద్వారా 50,000 వేలు, మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా లక్ష రూపాయలు సబ్సిడి లోన్లు, మైనారిటి మహిళకు స్కిల్‌ డవలెప్మెంట్‌ ద్వారా కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారని గుర్తు చేశారు. అనంతరం షేక్‌ అమిర్‌ బాషా ను మైనారిటి నాయకులు శాలువాతో సన్మానించారు. పొదలకూరు మండల టిడిపి పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు. మల్లికార్జున్‌ నాయుడు, మనుబోలు మండల టీడీపీ నాయకుడు కోదండ రామిరెడ్డి ఉన్నారు.

➡️