వ్యవసాయ కూలీలను పట్టించుకోని ప్రభుత్వాలు

Dec 17,2023 21:54 #coolilu
ఫొటో : మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు

ఫొటో : మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
వ్యవసాయ కూలీలను పట్టించుకోని ప్రభుత్వాలు
ప్రజాశక్తి-కొడవలూరు : దేశానికి అన్నం పెడుతున్న వ్యవసాయ రంగంలో కీలకంగా ఉన్న వ్యవసాయ కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్మిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం భవన నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం కొడవలూరు మండలం యల్లాయపాలెం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, దామరమడుగు గ్రామంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో పనులు లేక వ్యవసాయ కార్మికుల జీవనస్థితిగతులు అగమ్యగోచరంగా ఉందన్నారు. వ్యవసాయ కార్మికుల కోసం తెచ్చిన ఉపాధి హామీ చట్టం కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల నీరుగారిపోయే పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిధులు కోత పెట్టడంతో ఉపాధి పనులు లేక సొంత గ్రామాల్లో ప్రజలు బతకలేక వలసలు పోయే పరిస్థితి ఉందని తెలిపారు. మరోవైపు విద్య, వైద్యం అందక బతుకు జీవుడా అని పట్టణాలకు వలసలు వెళుతున్నారు. వ్యవసాయ కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ కార్మికుల కోసమే నిరంతరం కృషి చేస్తున్న ఆల్‌ ఇండియా కేంద్రాన్ని బిజెపి ప్రభుత్వం నిర్థాక్షణంగా ఖాళీ చేయించిందని తెలిపారు. కేంద్రంలో వ్యవసాయ కార్మికులకు నిలువు నీడ లేకుండా ఉందని తక్షణమే వ్యవసాయ కార్మిక సంఘం కార్యకలాపాలకు ఒక ఆఫీసు నిర్మాణం చేసుకోవాలని తెలియజేశారు. అనుకున్న ఆ కార్యాలయ నిర్మాణానికి దేశంలో ఉన్న కూలీల దగ్గర నుండి విరాళాలు సేకరించి భవనం నిర్మించుకోవాలన్నారు. కాబట్టి వ్యవసాయ కూలీలందరూ కూడా తోచిన విధంగా ఎంతోకొంత సహాయం చేసి వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జొన్నలగడ్డ వెంకమరాజు, మంగళ పుల్లయ్య, వ్యకాసం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లూరు మాల్యాద్రి, పోతేగుంట దేవకుమారి, జిల్లా కమిటీ సభ్యులు బట్ట పెద్దబ్బయ్య, నక్క రాధయ్య, బెల్లంకొండ నాగమ్మ, భూలోకం కాంతారావు, పద్మమ్మ, రవణమ్మ, తంబి రమణయ్య, తాటిపోయిన మస్తానయ్య, కోరికల విజయమ్మ, గుండాల రవణమ్మ, సిఐటియు నాయకులు గోనె దయాకర్‌, కార్మిక సంఘం నాయకులు వడ్లపూడి నరసయ్య, మండల కార్యదర్శి ఎస్‌కె మహబూబ్‌ బాషా, కాకి శివయ్య, చిట్టిబాబు, మన్నెం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

➡️