వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మమైన మార్పులను తీసుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెచ్‌యు ఉద్యాన పరిశోధన స్థానంలో అరటి పరిశోధనా కేంద్రంలో అరటి సవత్సరం 2023-24 ముగింపు కార్యక్రమంలో మంత్రి గోవర్ధన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశీయంగా 42 సంస్థల్లో అరటి రకాలపై శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అరటి సాగులో మరింత మెరుగైన ఉత్పత్తికి అయ్యే దిశలో ఐసిఆర్‌ ద్వారా అవగాహన ఒప్పదం చేసుకున్నట్టు తెలిపారు. దశలవారీగా అరటి పండ్ల రకాలపై విస్తత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. 2023-24 అరటి సాగు ప్రోత్సాహ సంవత్సరంగా నిర్ణయించారన్నారు. అరటి పండు, ఆకులు, కాండము, పిలకలు అన్నీ ఎంతో ఉపయోగ పడతాయన్నారు. రైతుల పక్షాన బీమా పథకం వాయిదా చెల్లించడం ద్వారా, కేంద్రం అమలు చేస్తున్న ఫసల్‌ బీమా పథకం నియమ నిబంధనలు కాదని, రైతుల పక్షాన నిలబడే దిశలో రాష్ట్రంలో అన్ని పంటలకు కూడా బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నేడు కేంద్రం కూడా దిగివచ్చి ఫసల్‌ బీమా పథకంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానం ప్రకారం మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. హార్టికల్చర్‌ యూనివర్సిటీ విసి డాక్టర్‌ టి.జానకిరామ్‌ సేవలను గుర్తించి మరో ఏడాది పొడిగించామన్నారు. భూమి సారవంతాన్ని బట్టి అందుకు సంబంధించిన పంటలు వేసే దిశగా సాయిల్‌ టెస్టింగుకు అధిక ప్రాధాన్యతని ఇస్తున్నామన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఆర్‌బికెలు ఏర్పాటు చేసి రైతు ఇంటి వద్దకే నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందిస్తున్నట్టు చెప్పారు. పంటల ఉత్పత్తులను నిలువ ఉంచుకుని, మంచి ధర వచ్చినప్పుడు రైతులు మార్కెట్లో విక్రయించుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రకతి విపత్తులతో నష్టపోయిన రైతాంగానికి అదే సీజన్‌లో పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. విసి జానకిరామ్‌ మాట్లాడుతూ అరటి సాగులో సేంద్రియ విధానంలో రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతులకు టిష్యూ కల్చర్‌ అరటి మొక్కలను 13 లక్షలకు పైగా అందించామన్నారు. గణనీయమైన దిగుబడి సాధించే దిశగా డ్రోన్స్‌ వినియోగంపై కేత్ర స్థాయిలో రైతులకు అవహగాన కల్పించామన్నారు. 130 దేశాల్లో అరటి సాగు ఉందని, 150 మిలియన్‌ టన్నుల అరటి పండ్లు, కూర రకాల ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు. అరటి విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లా అగ్రి బోర్డు చైర్మన్‌ బూరుగుపూడి సుబ్బారావు, పలువురు శాస్త్రవేత్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బి.రామానందం, డాక్టర్‌ ఎ.పద్మావతమ్మ, డాక్టర్‌ ఎం.మాధవి, డాక్టర్‌ ఎల్‌.నారం నాయుడు, డాక్టర్‌ ఇ.కరుణశ్రీ, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️