శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : జెవివి

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని అలమరుచుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ బి. సీతారామశాస్త్రి పేర్కొన్నారు. స్థానికరెడ్డి మహిళా జూనియర్‌ కళాశాలలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్నాపత్రాలను సీతారామశాస్త్రి హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ బాచిమంచి సీతారామశాస్త్రి, వేమన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ నారపురెడ్డి భారతమ్మ, గణిత శాస్త్ర అధ్యాపకులు జంకె సుబ్బారెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా సమత నాయకురాలు ఆర్‌.ఎం. ఝాన్సీ పాల్‌, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్‌ రెడ్డి, యుటిఎఫ్‌ నాయకులు ఒద్దుల వీరారెడ్డి, వి. శ్రీరాములు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ఏనుగుల రవికుమార్‌, సయ్యద్‌ రఫీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు టంగుటూరి సుధాకర్‌, కొండెపోగు ప్రదీప్‌ కుమార్‌, ఓబినబోయిన రామాంజ నేయులు, మండ్లా సాయిబాబు, మల్లికార్జున, శశిధర్‌, నరసయ్య, మస్తాన్‌, రాజు,గోళ్ల సురేంద్ర, శంకర్‌ రెడ్డి, సాయికష్ణ, రంగయ్య, మహమ్మద్‌ బాబు, ఏనుగుల శివ, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు మండ్ల సజీవ రాజు, షేక్‌ యాసిన్‌, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చీమకుర్తి : జనవిజ్ఞాన ఆధ్వర్యంలో మండల స్థాయిలో చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. టాలెంట్‌ టెస్టుకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి 16 టీములు పాల్గొన్నాయి. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో గోనుగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి, దేవరపాలెం జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి, గురుకుల పాఠశాల విద్యార్థులు తతీయ బహుమతిని సాధించారు. ప్రైవేటు పాఠశాలల విభాగంలో సిపిఎస్‌ విద్యార్థులు ప్రథమ బహుమతి, గౌతం పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి, లిటిల్‌స్టార్‌ విద్యార్థులు తతీయని సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ జవహర్‌, లైన్స్‌ క్లబ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ చలువాది బద్రీ నారాయణ, నూనె వెంకట సుబ్రహ్మణ్యం, నూనె హేమ సుందర్‌ రావు, జెవివి మండల అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, చలువాది రమేష్‌, కోశాధికారి ఆంజనేయులు, లైన్స్‌ క్లబ్‌ గెలాక్సీ అధ్యక్షుడు ముత్యాల ప్రసాదు, సోమ శ్రీనివాసరావు దేవదాసు విశ్వభారతి ఎం హరి ప్రసాద్‌, ప్రిన్సిపల్‌ శాంతి మాధురి, సుబ్బారావు పాల్గొన్నారు గిద్దలూరు రూరల్‌ : స్థానిక అరుణోదయ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక సీనియర్‌ నాయకులు డాక్టర్‌ భూమా బాల నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రశ్న అనేది సైన్స్‌ అభివద్ధికి మూలమని తెలిపారు. సైన్స్‌ లేనిదే భూమి మీద మానవుడి మనుగడ సాధ్యం కాదన్నారు. అనంతరం విజేతల వివరాలను చెకుముకి కన్వీనర్‌ డి. వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నారాయణ, డాక్టర్‌ మోహన్‌ రెడ్డి, తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్‌, పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్‌ శివాపురం. ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయుడు గురు ప్రసాద్‌ పాల్గొన్నారు. యర్రగొండపాలెం : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ను స్థానిక కష్ణవేణి స్కూల్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జనరల్‌ సెక్రెటరీ శేఖర్‌, కష్ణవేణీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కష్ణ, ఉపాధ్యా యులు ప్రసాద్‌, రాంబాబు నాగరాజు, నాగేశ్వరరావు, భారతి పాల్గొన్నారు. దర్శి : స్థానిక న్సీ స్కూల్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్సు సంబరాలను నిర్వహించారు. ఈ పోటీల్లో మండల పరిధిలోని తూర్పు వెంకటాపురం, గవర్నమెంట్‌ హైస్కూల్‌, కురిచేడు దేకనకొండ, దొనకొండ మండలం ఆరవళ్లిపాడు విద్యార్దులు ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర నాయకులు కె.సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ బి.కోటిరెడ్డి దేవప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి,వెంకటేశ్వర్లు తదతరులు పాల్గొన్నారు. కంభం రూరల్‌ : కంభం బోర్డు స్కూల్‌ జెవివి ఆధ్వర్యంలో మండల స్థాయిలో చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాల్యాద్రి మాట్లాడుతూ పోటీ పరీక్షలు విద్యార్థుల్లో సజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు. జెవివి మండల అధ్యక్షుడు నారపరెడ్డి రమణారెడ్డి మాట్లా డుతూ విద్యార్థి దశ నుండే శాస్త్ర సాంకేతిక రంగాల పై మక్కువ పెంచుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వరుకుంట్ల వెంకటేశ్వర్లు, జనవిజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు నాగేంద్రుడు, పార్థసారథి ,పాఠశాల ఉపాధ్యాయులు గఫూర్‌, సలీమా, కుర్షిద ,మణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️