శిద్దా వెంకటసుబ్బారావుకు నివాళి

ప్రజాశక్తి-చీమకుర్తి : మాజీ మంత్రి శిద్దారాఘవరావు సోదరుడు, శ్రీవాసవీ గ్రానైట్‌ యజమాని శిద్దా వెంకటసుబ్బారావుకు పలువురు ఘన నివాళులర్పించారు. స్థానిక శిద్దావారి వీధిలో శిద్దా వెంకటసుబ్బారావు సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. శిద్దా వెంకట సుబ్బారావు కుమారులు శిద్దా హనుమంతరావు, శిద్దా సుధాకర్‌ ,శిద్దా సోదరులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శిద్దా వెంకటసుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, లక్ష్మిపద్మావతి దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు శిద్దా సుధీర్‌కుమార్‌, మన్యం ఫణికుమార్‌, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిఎన్‌.విజయకుమార్‌, శిద్దా వెంకటేశ్వరరావు, శిద్దా నాగేశ్వరరావు,శిద్దా పాండు రంగారావు,శిద్దా కృష్ణారావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, శిద్దాపెదబాబు,శిద్దా సాయిబాబు, శిద్దా హనుమంతరావు, శిద్దా సూర్యప్రకాశరావు, శిద్దా సుధాకర్‌, శిద్దా ఆంజనేయప్రసాద్‌, శిద్దా కాశీ విశ్వేరరావు,శిద్దా శ్రీనివాసరావు,శిద్దా సురేష్‌,శిద్దా బాలాజీ, ఒంగోలు గెలాక్సీ అధినేత చలువాది బదరినారాయణ, మద్దిపాడు ఎఎంసి మాజీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి, టిడిపి నాయకులు కాట్రగడ్డ రమణయ్య, ప్రసాదు, కందిమళ్ళ గంగాధరరావు, హనుమంత రావు, రావిపాటి శ్రీను,యడ్లపల్లి రామబ్రహ్మం,వైసిపి నాయకులు మన్నం శ్రీధర్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఉన్నారు.

➡️