శివారు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-టంగుటూరు : టంగుటూరు పంచాయతీ పరిధిలోని శివారు కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలు కనీస మౌలిక వసతులు లేక దుర్భర జీవితం గడుపుతున్నారని, శివారు కాలనీలపై దష్టి సారించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వైసిపి సీనియర్‌ నాయకులు సూదనగుంట నారాయణరావు, సోమేపల్లి మురళీకష్ణ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ను సోమవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టంగుటూరు శివారు కాలనీలైన పోతుల చెంచయ్య వెస్ట్‌ కాలనీ, అంబేద్కర్‌ నగర్‌, ఈస్ట్‌ కాలనీ, అరుంధతి నగర్‌, సౌత్‌ బీసీ కాలనీ, బుచ్చిరాజుపాలెం, బాబూజీ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ఈ కాలనీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటున్నట్లు తెలిపారు.పోతుల చెంచయ్య వెస్ట్‌ కాలనీలో అంతర్గత రోడ్లతో పాటు ఇళ్లపట్టాలు కోర్టు కేసుల విషయంలో కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అంబేద్కర్‌ నగర్‌, అరుంధతి నగర్‌లో రామతీర్థం మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ విన్న మంత్రి సురేష్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పంచాయతీ పరిధిలోని వైసీపీ నాయకులను మంత్రి సురేష్‌ కు పరిచయం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బీనీడి ఉదరు కుమార్‌, సోమేపల్లి మురళీకష్ణ, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ షేక్‌ నజీర్‌, టంగుటూరు-4 సచివాలయం కన్వీనర్‌ పులిచర్ల కోటయ్య, నాయకులు గొల్లపూడి సునీత, మిరియాల కుమార్‌, పుట్టా మల్లికార్జున, సుంకర సురేష్‌ బాబు, నాగిపోగు ఏడుకొండలు, ఇత్తడి కుమార్‌, బ్రహ్మయ్య, కొండలు తదితరులు పాల్గొన్నారు.

➡️