శేషు స్కూల్లో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

Dec 23,2023 18:04
వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు

వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు
శేషు స్కూల్లో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు
ప్రజాశక్తి -నెల్లూరు అర్బన్‌ బుజ బుజ నెల్లూరులోని శేషు ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్లో శనివారం ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఏసుక్రీస్తు జననం నాటిక ,నత్య ప్రదర్శనలు, పిల్లల ఉపన్యాసాలు అందరినీ అలరించాయి.తానా వారు నిర్వహించిన” శతక పద్యార్చన” ను 80 మందితో చేయించిన శశికళా మేడమ్‌ను, క్రిస్మస్‌ సంబరాలు చేయించిన మేరీ మేడంను కరస్పాండెంట్‌ సత్కరించారు. ఏసుక్రీస్తు శాంతిస్వరూపుడని కొనియాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️