శ్రమజీవులకు అండ ఎర్రజెండా

Dec 26,2023 20:36
ఫొటో : సిపిఐ జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు దమ్ము దర్గాబాబు

ఫొటో : సిపిఐ జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు దమ్ము దర్గాబాబు
శ్రమజీవులకు అండ ఎర్రజెండా
ప్రజాశక్తి-జలదంకి : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెహ్రూ నగర్‌ శాఖ ఆద్వర్యంలో నాయకులు దమ్ము దర్గాబాబు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఐ 1925 డిసెంబర్‌ 26 కాన్పూర్లో ఆవిర్భవించిందని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోరకు ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. దున్నేవానికి భూమి అనే నినాదంతో పేదల ప్రజలకు వేలాది ఎకారాలు పంపిణీ చేశారన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నిరంకుశ పాలన కొనసాగుతుందని బిజెపిని వైసిపిని 2024లో గద్దె దింపాలన్నారు. కార్యక్రమానికి రాజు, లక్ష్మణ్‌, చెంచయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️