సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే ఆరా

ప్రజాశక్తి-శృంగవరపుకోట: పట్టణంలో ఒకటో సచివాలయ పరిధిలోని శ్రీనివాస కాలనీలో బుధవారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా ? అని ఆరాతీశారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందిన సంక్షేమ పథకాలపై ఆరాతీయడం, గ్రామాల్లో సమస్యల గుర్తింపు, తదుపరి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం, పరిష్కరించడం… ఈ నాలుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోని కీలక అంశాలని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పెనిశెట్టి రమణ, వెంకట్రావు, కోటిబాబు, గణేష్‌, కేత వీరన్న, కడారి జయశంకర్‌, పెంట గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.వైసిపితో ప్రజలకు మేలు : ఎమ్మెల్యేనెల్లిమర్ల : వైసిపి ప్రభుత్వంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పల నాయుడు అన్నారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ పద్మశాలి వీధి సచివాలయం పరిధిలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మన ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి వారిని అడగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ బంగారు సరోజినీ, మండల పార్టీ ప్రెసిడెంట్‌ చనమల్ల వెంకట రమణ, నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్‌ చిక్కాల సాంబశివ రావు, వైస్‌ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, వైసిపి జిల్లా సెక్రటరీ గంట సతీష్‌ పాల్గొన్నారు.ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలుతెర్లాం : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు వచ్చాయని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. మండలంలోని సుందరాడ గ్రామంలో సచివాలయ, ఆర్‌బికె, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి నర్సుపల్లి ఉమాలక్ష్మి, గర్బాపు రామారావు, వైస్‌ ఎంపిపి చెపేన సత్యనారాయణ, సర్పంచ్‌ అద్దంకి దిలీప్‌ కుమార్‌, వైసిపి మండల అధ్యక్షుడు తెంటు సత్యంనాయుడు, వైసిపి నాయకులు బోను అప్పలనాయుడు, అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️