సచివాలయంలోకి నీళ్లు

ప్రజాశక్తి-పొదిలి: పొదిలిలో తుపాను ప్రభావంతో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఒకటో సచివాలయం నీట మునిగింది. సచివాలయంలోకి నీళ్లు వచ్చి ఫర్నిచర్‌ కొంతమేర నీట మునిగింది. అయితే సచివాలయంలో కొంతభాగం మున్సిపల్‌ శానిటరీ సిబ్బంది వాడుకుంటున్నారు. సచివాలయంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదని, శానిటరీ సిబ్బంది ఉపయోగించే రూములోకి మాత్రం నీళ్లు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.

➡️