సచివాలయంలో తనిఖీలు

Jan 27,2024 21:39

ప్రజాశక్తి-సీతానగరం :మండలంలోని పెదబోగిలి సచి వాలయాన్ని శనివారం ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌, డ్వామా పీడీ రామచంద్రరావు పరిశీ లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 97 పంచాయతీల్లో లైబ్రరీలు ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులకు వివిధ రకాల పోటీ పరీక్షల కోసం 132 రకాల పుస్తకాలు అందించామని తెలిపారు. అభిలాష యాప్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. దీనిద్వారా ఎవరు, ఏ పుస్తకాలు తీసుకెళుతున్నారో తెలుస్తుందన్నారు. జిల్లాలో అన్ని పంచాయతీలలోనూ ఈ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఒ జి.వెంకటరమణ, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️