సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం

Feb 14,2024 22:23
ఫొటో : సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి

ఫొటో : సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి
సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం
ప్రజాశక్తి-సీతారామపురం : సచివాలయాల ద్వారా ప్రజలకు కావాల్సిన గ్రామ స్వరాజ్యం అందుతుందని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ ఎంపిపి కల్లూరి జనార్థన్‌ రెడ్డి, సర్పంచ్‌ కల్లూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బాలాయపల్లి సచివాలయాన్ని, పోరుమామిళ్ల కాశయ్య ఆధ్వర్యంలో పబ్బులేటిపల్లి సచివాలయం, అయ్యవారి పల్లి సచివాలయాన్ని, పలు రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాలలో విజయ సంకల్ప యాత్రను నిర్వహించారు. వైసిఇ ప్రభుత్వంలో ప్రతీ గ్రామం పట్టణాలను తలపించేలా అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఉంటేనే పుట్టిన బిడ్డనుండి వృద్ధుల వరకు ప్రతి పథకం కొనసాగుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలలో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి ఎంఎల్‌ఎగా తనను, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. నవరత్నాలేకాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అన్ని విధాల వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి చెరుకుపల్లి రమణారెడ్డి, ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి, రాష్ట్ర బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పి.సి.అల్లూరు రాజు, మండల వైసిపి కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపిలు కల్లూరి జనార్దన్‌ రెడ్డి, అబ్రహం, సర్పంచులు కల్లూరి వెంకట రెడ్డి, దుర్గాప్రసాద్‌ యాదవ్‌, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.

➡️