సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం

పల్నాడు జిల్లా: సమగ్ర శిక్షా ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఫెడరేషన్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగింది. స్థానిక ధర్నా చౌక్‌ వద్ద జరుగుతున్న సమ్మెకు ఎస్టియు పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ రామకోటయ్య ,రొంపిచర్ల మండల ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బిక్కి ప్రజా మూర్తి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల డిమాండ్లను పరి ష్కరించాలని ఆయా శాఖలో పనిచేస్తున్న వేల కుటుం బాలను ఆదుకోవాలని కోరారు.సిఆర్‌ఎంటి లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, మండలం అకౌంటెంట్లు ,మెసెంజర్సు, ఆర్ట్స్‌, క్రాఫ్ట్‌, పి ఈ టి, సైడ్‌ టీచింగ్‌ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని పని భారం తగ్గించాలని అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్‌ చార్ట్‌ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులందరికీ రూ 10 లక్షల రిటైర్మెంట్‌ కల్పించాలని కోరారు. ఉద్యోగులకు సామా జిక భద్రత పథకాలు ఈపీఎఫ్‌ ఈఎస్‌ఐ అమలు చేయా లన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పి.రామ కృష్ణ, పి. సాంబశివరావు, సిహెచ్‌ అంజిరెడ్డి, బి.మల్లి కార్జున, ఫయాజ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

➡️