సమన్వయంతో పనిచేసి బూచేపల్లిని గెలిపిద్దాం

ప్రజాశక్తి-దర్శి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి వైసిపి తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో బుధవారం వైసిపి దర్శి నియోజకవర్గ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అని, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అందరూ మన్ననలు పొందిన వ్యక్తిగా కొనియాడారు. అంతకు ముందు కార్యాలయాన్ని ప్రారంభించి వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు ఎస్‌ఎం బాషా, కుమ్మిత అంజిరెడ్డి, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, పోశం మధుసూదన్‌రెడ్డి, కోటా రామిరెడ్డి, వీరగంధం కోటయ్య, మోషేతో పాటు కొల్లా భాస్కర్‌, పుల్లారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసతో పాటు ఎంపీపీలు గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య, సునీత బ్రహ్మానందరెడ్డి, ఉషామురళి, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

➡️