సమస్యలు పరిష్కరించాలి

మార్కాపురం : మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని మున్సిపల్‌ కమిషనర్‌ డి.రవీంద్ర శుక్రవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై కమిషనర్‌తో చర్చించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించేలా పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని కలిసిన వారిలో మున్సిపల్‌ డిఇ షేక్‌ సుభానీ, మున్సిపల్‌ ఆర్‌ఐ నాయక్‌, తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ మొఘల్‌ సీరాజ్‌తుల్లాబేగ్‌, వైసిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు తడికమళ్ల బాలసుబ్బారావు, వైసిపి ప్రచార కమిటీ పట్టణ అధ్యక్షులు మయూర్‌ ఖాశిం ఉన్నారు.

➡️