సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ

Jan 8,2024 21:24

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : తమ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరిష్కరిస్తేనే సమ్మెను విరమిస్తామని లేనియెడల కొనసాగిస్తామని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు, ప్రజారోగ్య, ఇంజనీరింగ్‌ విభాగం ఔట్సోర్సింగ్‌ కార్మికులు హెచ్చరించారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ అధ్యక్షులు నాగవంశం శంకరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.రమణారావు, కోశాధికారి జి.వెంకటరమణ ఆధ్వర్యాన సోమవారం పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, ఆప్కాస్‌, ఇంజినీరింగ్‌, వాటర్‌ వర్కర్స్‌, విద్యుత్‌ విభాగ కార్మికులు స్థానిక పాతబస్టాండ్‌ నుంచి ప్రధాన రహదారి గుండా బెలగాంలో ఉన్న కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ బైఠాయించి నిరసన తెలుపుతూ జెసి గోవిందరావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరుచంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ ఎంఎల్‌ నాయకులు భాస్కరరావు, సిపిఎం ఎం ఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు పి.రమణి, బి.నరసింహారావు, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు సంఘం, రైతు కూలీ సంఘం నాయకులు విశ్వేశ్వరరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మద్దతు తెలిపారు. అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. సమ్మె కారణంగా తాగునీరు, పారిశుధ్యం వీధి దీపాలు వంటి సమస్యలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రజలకు కోట్లాది రూపాయల నిధులను అందజేస్తున్న yధెస్‌ జగన్మోహన్‌ రెడ్డి తమ సమస్యల పరిష్కారానికి చొరవచూపకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించకపోతే సమ్మె విరమించేది లేదని అన్నారు. కార్యక్రమంలో సాలూరు, పార్వతీపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో వీరు నిర్వహిస్తున్న కార్మికులతో పాటు చీపురుపల్లి సింహాచలం, నాగవంశం మల్లేష్‌, మామిడి శివ, బంగారి రాజేష్‌, బంగారి రవి, నాగవంశం పాపులమ్మ, నాగవంశం నిర్మల, ్మ, తాడ్డి వినరు, తాతబాబు, క్రాంతి, చిన్ని కృష్ణ, గణపతి, బాల,శంకరరావు, మేడిశెట్టి కష్ణ, పాలకొండ రంజిత్‌, ఉమా, టి.ఇందు, టి.శంకర్రావు, రవి, టి.రాముడు, పి.వేణు, కార్మికులు అధిక పాల్గొన్నారు.

➡️