సమస్యలు లేని నగరంగా మార్చుతాం

Jan 7,2024 22:01

విజయనగరంటౌన్‌ : విజయనగరాన్ని సమస్యలు లేని నగరంగా మార్చుతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి నగరాన్ని రాజీ పడకుండా అభివద్ధి చేశారని కొనియాడారు. ఆదివారం ధర్మపురి లో 30, 31 డివిజన్ల పరిధిలో రూ.2 కోట్ల అంచనా విలువతో, కె.ఎల్‌పురం 45, 47 డివిజన్ల పరిధిలో రూ. 1.60 కోట్ల అంచనా విలువతో నిర్మించిన వాటర్‌ ట్యాంకులను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్లతో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమత్‌ పధకం కింద మరో 60 కోట్లతో ముషిడిపల్లి నుండి విజయనగరం వరకు కొత్త పైప్‌లైన్‌ వేసి నగరానికి రెండు పూటలా నీరందించడానికి కషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, కార్పొరేటర్లు గణపతి, సంతోషి, కమిషనర్‌ శ్రీరాములు నాయుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఇ గణపతి రావు, ఇఇ దక్షిణా మూర్తి పాల్గొన్నారు.

➡️