సమస్యల గ్రామస్తులతో ‘కాకర్ల’ చర్చ

Feb 7,2024 22:09
ఫొటో : గ్రామస్తులతో మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌

ఫొటో : గ్రామస్తులతో మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌
సమస్యల గ్రామస్తులతో ‘కాకర్ల’ చర్చ
ప్రజాశక్తి-ఉదయగిరివింజమూరు మండలం చాకలికొండ గ్రామ సమస్యల చర్చలో పాల్గొన్న నియోజకవర్గ టిడిపి నాయకులు కాకర్ల వ్యవస్థాపకులు కాకర్ల సురేష్‌ పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం చాకలికొండ గ్రామంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్‌ సంజీవని ఆరోగ్య రథంతో అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సంజీవని ఆరోగ్య రథంతో అందుతున్న వైద్య సేవలు గురించి కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, కాకర్ల సురేష్‌, సునీల్‌ గ్రామస్తులను అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో కాకర్ల ట్రస్ట్‌ సిఇఒ కాకర్ల వెంకట్‌, కూనల వెంకటేశ్వర్లు, మబ్బు బుజ్జయ్య, డబ్బుగుంటి జనార్ధన్‌, దిండు మహేష్‌, ఉప్పురెట్ల వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️