సమస్యల పరిష్కారం కోసమే పర్యటన

ప్రజాశక్తి-దర్శి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని, ఆ పథకాలు అందాయా లేదా అని తెలుసుకొని, సమస్యల పరిష్కరించడం కోసం తాను గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసిపి ఇన్‌చార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శివరాత్రి రోజున కూడా దర్శి పట్నంలోని 6వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి అందరికీ జరగాలంటే మళ్లీ వైసిపికి పట్టం కట్టాలన్నారు. భవిష్యత్తులో పథకాలన్నీ పేదలందరికీ అందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పథకాలన్నీ అర్హులైన వారికి అంతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పోటీలో నెగ్గలేకనే బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ముందుకు సాగుతున్నాయని విమర్శించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడతారన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. అభిమానులు వారిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్‌రెడ్డి సతీమణి నందిని, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డితోపాటు 6వ వార్డు కౌన్సిలర్‌ నారాయణమ్మ, నారాయణరెడ్డి, నాయకులు శివారెడ్డి, నరసింహారెడ్డి, మోహన్‌రెడ్డి, పుల్లారెడ్డి, కెవి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా శివరాత్రి వేడుకలుదర్శి శివాలయంలో శివరాత్రి సందర్భంగా శివాలయం ట్రస్ట్‌ చైర్మన్‌ నారపుశెట్టి శివప్రసాద్‌ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూచేపల్లి, మాజీ శాసన సభ్యులు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సతీమణి నందిని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌ శివప్రసాద్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దర్శి పట్టణంతోపాటు ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా కొర్లమడుగు, పోతవరం, పొతకమూరు శివాలయాల్లో శివరాత్రి శోభసంచరించుకుంది.

➡️