సమస్యల పరిష్కారానికి విఒఎల ఆందోళన

ప్రజాశక్తి-మార్కాపురం: డిఆర్‌డిఎ-వైకెపి మండల పరిధిలోని విఒఎలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేశారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నెల 30, 31 తేదీల్లో విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి విఓఎల ధర్నా, వంటా వార్పు కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. విఓఎల మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలని కోరారు. హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలని కోరారు. వీటితో పాటు విఓఏల సంఘం చేసిన పది డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపిడిఒ టి చందనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ జిల్లా నాయకులు డికెఎం రఫీ, పి రూబెన్‌, విఒఏలు రంజాన్‌బి, కాశింబి, జ్యోతి, సరళ, శైలజ, దివ్యలతో పాటు మండలంలోని వివిధ గ్రామ సంఘాల విఓఏలు పాల్గొన్నారు.

➡️