సమ్మెను పరిష్కరించాలని లబ్ధిదారుల ధర్నా

Dec 15,2023 23:27
నిర్లక్ష్యంగా వ్యవహరించడం

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

అంగన్‌వాడీల న్యాయమైన సమ స్యలను పరిష్కరించి సమ్మెను విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ధర్నా చేశారు. రూరల్‌ మండలం తూరంగి పంచాయతీలో శుక్రవారం అంగన్‌వాడీ కేం ద్రాల ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారులు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణ సిపిఎం కార్యదర్శి తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లా డుతూ పిల్లలకు, బాలింతలకు పౌష్టి కాహారాన్ని అందిస్తున్న అంగన్‌వాడీ సెంట ర్లను, సేవలందిస్తున్న కార్యకర్తలు, ఆయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎటు వంటి బేషిజాలకు పోకుండా సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం లబ్దిదారులు సచివాలయ కార్యదర్సికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు చింతపల్లి అజరు కుమార్‌, తటవర్తి సుబ్బా రావు, పొట్నూరి జయప్రకాష్‌, జోగా అప్పారావు యుటిఫ్‌ విశ్రాంత నాయకులు పుప్పాల గోవిందరాజులు, జనసేన నాయకులు, లబ్దిదారులు కక్కల సునీత, ఆకుల రజనీ, దువ్వి వెంకట దేవి, చింత అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

➡️