సమ్మె శిబిరాల వద్ద విజయోత్సవాలు

Jan 24,2024 00:43

తాడేపల్లి శిబిరం వద్ద టపాసులు కాలుస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-తాడేపల్లి :
చావనైనా చస్తాంగానీ ఉద్యమ జెండాను వదలబోమని అంగన్‌వాడీలు ఉద్ఘాటించారు. అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో వారు సమ్మెను విరమించి మంగళవారం దీక్షా శిబిరాల వద్ద విజయోత్సవ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగా తాడేపల్లి శిబిరం వద్ద కేక్‌ను కట్‌ చేయడంతోపాటు టపాసులు పేల్చారు. సభలో పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ ఉద్యోగం పోతుందని, పని చేసే సెంటర్‌కు వెళ్లాలని అందరూ ఒత్తిడి చేశారని, అయితే అలా ఒత్తిడి చేసి నన్ను ఉద్యోగానికి పంపిస్తే మా చావుకు మీరే కారణం అని కుటుంబ సభ్యులను ఎదిరించి సమ్మె శిబిరానికి వచ్చానని ఓ అంగన్‌వాడీ చెప్పిన మాటలు అందరిలోనూ కొత్త స్ఫూర్తిని నింపాయి. పోలీసులు దుర్మార్గంగా కొడుతున్నా, లాఠీదెబ్బలు తింటున్నా పోరాటం నేర్పిన చైతన్యంతో వెనుదిరిగి చూడలేదని మరో అంగన్‌వాడీ అనుభవాలను చెప్పారు. ఉద్యోగం పోతుందని బెదిరింపులు ప్రతిరోజూ నిత్య కృత్యమైనా 42 రోజుల పాటు ఇల్లు, దీక్షా శిబిరం తప్ప ఉద్యోగం పోయినా ఫర్వాలేదనే విధంగా ఈ పోరాటం స్ఫూర్తి నింపిందని మరో అంగన్‌వాడీ తెలిపారు. ఉద్యమం జరిగిన తీరు తమను ఆకర్షించిందని, సిఐటియు జెండాను వీడమని సుజాత, కిరణ్మయి, శశిరాణి, కమల, కుమారి అన్నారు. సభకు కె.తబిత అధ్యక్షత వహించగా సిఐటియు, ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, ఐద్వా, రైతు సంఘం, సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి నాయకులు మాట్లాడారు. ఐక్య పోరాటాల ద్వారానే విజయం సాధ్యమని అంగన్‌వాడీ పోరాటం తెలియజేస్తుందని చెప్పారు. పెద్దఎత్తున సాగిన ఈ యుద్ధంలో అంగన్‌వాడీలు గెలిచారని ప్రశంసించారు. సభలో వి.దుర్గారావు, బి.వెంకటేశ్వర్లు, జె.శివశంకరరావు, డి.వెంకటరెడ్డి, డి.శ్రీనివాసకుమారి, పి.గిరిజ, కె.కరుణాకరరావు, డివి భాస్కరరెడ్డి, కె.మేరి, తులసమ్మ, కె.వెంకటయ్య, శంకర్‌, టి.వెంకటయ్య, ఎం.చెన్నయ్య, ప్రసాద్‌, డి.సామ్యేలు, రాజ్యలక్ష్మి, అరుణ, వరలక్ష్మి, మాణిక్యం, నాగలక్ష్మి, అమృత, రమణ, జసంత, వైదేహి, భవానీ, మరియమ్మ, కమల, కోటేశ్వరి, ఫాతిమ, పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదకాకాని : స్థానిక సుందరయ్య కాలనీలోని సిఐటియు కార్యాలయంలో ఇందువాణి అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ప్రభుత్వం అంగీకరించిన అంశాలపై వివరించారు. 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, గడువు లోగా పరిష్కరించకుంటే తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి నన్నపనేని శివాజీ, యూనియన్‌ నాయకులు కె.రాజ్యలక్ష్మి,ప్రసన్న, కుమారి,సహజ, పావని పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : సంఘటితంగా పోరాడ్డం వల్లే సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు నాయకులు అన్నారు. అంబేద్కర్‌ సెంటర్లో గల సమ్మె శిబిరంలో స్వీట్లు పంచుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రసంగించారు. చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరల పోరాటాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, జెవి రాఘవులు, వై.కమలాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, రైతు సంఘం నాయకులు ఎం.పకీరయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.బాలాజీ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు షేక్‌ జానీబాష, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హేమలత, మేరీ రోజమ్మ, రుక్మిణి, సుహాసిని, స్వర్ణ, బేబీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : స్థానిక విఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా తెనాలి విజయవాడ రహదారి వెంబడి సమ్మె శిబిరంలో విజయోసత్సవ సభ నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎవిఎన్‌ కుమారి, సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్‌ మాట్లాడారు. పోరాటానికి మద్దతు తెలిపిన కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సిఐటియు నాయకులు షేక్‌ హుస్సేన్‌ వలి, అంగన్వాడి నాయకులు అనూరాధ, పి.పావని, హసీనా బేగం, నాగమణి, శాంతకుమారి పుష్ప, రజియా బేగం, పద్మ, కళాధరి, సుజాత, మాధవి, శ్రీలత, రాజకుమారి, రాధ, మల్లేశ్వరి, భాగ్యశ్రీ, లక్ష్మి, రత్న కుమారి, విజయ లక్ష్మి, సువర్ణ, పార్వతి, దేవి, జి సరోజిని, సూర్యకుమారి, జానకి, రాధిక, అరుణ కుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – ఫిరంగిపురం : స్థానిక సమ్మె శిబిరంలో విజయోత్సవ సభ నిర్వహించారు. సభకు ముందుగా 38 రోజులపాటు క్రమం తప్పకుండా హాజరైన చిన్నారి షైనీ గ్రేస్‌తో కేక్‌ను కట్‌ చేయించారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ 42 రోజులపాటు ఎంతో పట్టుదలతో సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ, ఆయా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సమ్మె శిపురాలకు మద్దతు తెలిపిన సంఘాలు, పార్టీలకు కృతజ్ఞతలు చెప్పారు. నాయకులు కె.విజయ, పి.రజిని, నందిని, సాగరిక, పద్మ, పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధానిలో అంగన్వాడీల ఆందోళన కు మద్దతు తెలిపిన వారికి సిఐటియు రాజధాని డివిజన్‌ కమిటి అభినందనలు తెలిపింది. తుళ్లూరులోని సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలు విజయోత్సవాన్ని జరిపారు. సిఐటియు రాజధాని డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎం.రవి, ఎం.భాగ్యరాజు మాట్లాడారు. పట్టు వదలకుండా అంగన్వాడీలు ఐక్యంగా పోరాడిన కారణంగా విజయం సాధించారని చెప్పారు. అన్ని పార్టీలు, సంఘాలు, మీడియా సంఘీభావంగా నిలిచాయని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నాయకులు పి.బాబురావు, జె.నవీన్‌ ప్రకాష్‌, యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణలత, ఎస్‌కె కరీమున్‌, నాయకులు అన్నామణి, రజిని, విజయలక్ష్మి, తనూజ, శంషాద్‌, సునీత, సుచరిత, తులసి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదనందిపాడు రూరల్‌ : సమ్మె శిబిరంలో విజయోత్సవం నిర్వహించారు. తమకు సహకరించిన అందరికీ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు శివపార్వతి శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్స్‌ పంచుకున్నారు. రైతు సంఘ నాయకులు వెంకట శివరావు, ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️