సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరగాలి

జెఎన్‌టియు విజయ నగరం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కె వెంకటసుబ్బయ్య

 

జెఎన్‌టియు విజయ నగరం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కె వెంకటసుబ్బయ్య

ప్రజాశక్తి -తగరపువలస :ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలని యువతకు జెఎన్‌టియు విజయ నగరం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కె వెంకటసుబ్బయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం దాకమర్రి రఘు విద్యాసంస్థల ఆధ్వర్యాన 3వ వైర్‌లెస్‌, యాంటినా మైక్రోవేవ్‌ సింపోజియంను ప్రారంభించారు, విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే ఈ తరహా అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడంశుభ పరిణామమన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు ఇతర శాస్త్రాలకు సమాన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉండనే విషయాన్ని యువత తెలుసుకోవాలని సూచించారుజనరల్‌ చైర్‌ డాక్టర్‌ పిఎస్‌ఆర్‌ చౌదరి, అమెరికాకు చెందిన రావ్‌.ఎస్‌ కన్సల్టెన్సీ నిర్వాహకులు డాక్టర్‌ సుధాకరరావు, నాసా జెఎల్‌పి ల్యాబ్స్‌ ప్రతినిధులు డాక్టర్‌ నాసిర్‌ చాహత్‌, డాక్టర్‌ పావులోఫో కార్డి, డాక్టర్‌ గౌరంగి గుప్తా, డాక్టర్‌ సివై డెస్మండ్‌ సిమ్‌, డాక్టర్‌ ఆర్‌ రామిరెడ్డి పాల్గొన్నారు

➡️