సాయి ఆర్థో ట్రామాకేర్‌ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌సి తోట

ప్రజాశక్తి-మండపేట

స్థానిక సాయి ఆర్ధో ట్రామాకేర్‌ ఆస్పత్రి 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజబాబు, 28వ కౌన్సిలర్‌ మొండి భవానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు మాట్లాడుతూ డాక్టర్‌ రాము ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉచిత రక్తదాన శిబిరాల ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్‌ రాము సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పెంకే గంగాధర్‌, వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ సీతిని సూరిబాబు, సాధనాల శివ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️