సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం

Jan 31,2024 21:37
చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో రచయిత పంచాగ్నుల విశ్వేశ్వర శర్మ జ్ఞాపకార్ధం ప్రముఖులకు అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా విశ్వేశ్వర శర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జి.ఎస్‌.టి.అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.ఉషా కిరణ్‌ మాట్లాడుతూ సేవా తత్పరులు రచయిత విశ్వేశ్వర శర్మ మన మధ్య లేకపోయినా ఆయన గుర్తుగా ప్రముఖులకు అవార్డులు అందజేస్తున్న మురళీమోహన్‌ రాజును అభినందించారు. అనంతరం రచయిత రాచపాలెం రఘు, కవి జంజం కోదండరామయ్యకు సాహితీ రత్న అందజేశారు. డాక్టర్‌ చీదరాల చెన్నయ్య, దూబిశెట్టి కళ్యాణిలకు సేవారత్న అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమానికి అసోసియేషన్‌ అధ్యక్షులు కె.మురళీమోహన్‌ రాజు సభాధ్యక్షులుగా వ్యవహారించారు. కార్యక్రమంలో డాక్టర్‌ కొండూరు హరినారాయణ రెడ్డి, బొనిగి ఆనందయ్య, ఎస్‌.వి.రమేష్‌ బాబు, అందేశ్రీనివాసులు, ఎన్‌.బలరామయ్య నాయుడు, టి.వెంకటేశ్వర్లు, సుధాకర్‌ రెడ్డి, కోడూరు శైలజ, గంటా రవికుమార్‌, దశరధరామిరెడ్డి పాల్గొన్నారు.

➡️