సిఎం జగన్‌కు మరోసారి అవకాశం ఇవ్వొద్దు :’చమర్తి’

ప్రజాశక్తి-వీరబల్లి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వద్దని, ఒకసారి ఇచ్చినందుకే రాష్ట్రం అధోగతి పాలవడంతో పాటు అభివద్ధిలో ముఫ్పై ఏళ్లు వెనక్కి పోయామని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు. ఆదివారం వీరబల్లిలోని టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ వైసిపి పాలన అంతా దాచుకో దోచుకో అన్న సామెతల ఉందన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా పాలించి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కేవలం మాటల చెప్పి వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమయ్యారని అన్నారు. మద్య నిషేధం చేయకుండా మద్యంతోనే దోపిడీ చేశారని విమర్శించారు. చెత్త మీద పన్ను వేయడం, అన్ని వస్తువుల పైన ధరలు పెంచి సామాన్లపై భారం పెంచారన్నారు. ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక దందాలు, బెదిరింపు దోరణిలు కనిపిస్తున్నాయని అన్నారు. రాజధాని లేకుండా చేసినా ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈనెల 27న పీలేరులో జరిగే రా కదిలి రా సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల శాఖ అధ్యక్షులు భానుగోపాల్‌రాజు. సర్పంచ్‌ నాగార్జున చారి, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, నాయకులు రెడ్డప్ప రెడ్డి, దుర్గామాంజనేయులు ఆంజనేయులు రెడ్డి, భాస్కర్‌ రాజు, జై చంద్రారెడ్డి, పాల్గొన్నారు.

➡️