‘దొడ్లేరు సిజిజిబి ఖాతాదారుల బంగారం వెంటనే ఇవ్వండి’

ఆర్‌ఎం సిహెచ్‌.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న ప్రజాసంఘాల నాయకులు, ఖాతాదారులు

 క్రోసూరు: దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో అప్రైజర్‌ నాగార్జున దొంగతనం కారణంగా కనబడకుండా పోయిన బం గారాన్ని ఖాతాదారులకు వెంటనే ఇవ్వా లని, వడ్డీ రాయితీ ఇవ్వాలని కోరుతూ గురువారం ప్రజా సంఘాలు, సిజిజిబి ఖాతాదారులతో కలిసి దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ సిహెచ్‌. శ్రీనివాసరావుని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడుతూ బంగారం కనబడకుండా పోయి 8 నెలలు దాటిందని, ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే రైతులను పిలిపించి వారికి నష్టపరిహారం చెల్లించే విషయమై చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో బ్యాంకు ముందు ఆందోళన చేస్తామని చెప్పిన నేపథ్యంలో దొడ్లేరులోని బ్యాంకు వద్ద రీజనల్‌ మేనేజర్‌ని తాము కలిసి నట్లు చెప్పారు.దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ చిరుమామిళ్ల శ్రీనివాసరావు ప్రజాసంఘాల నాయకులు ఖాతాదారులతో మాట్లాడుతూ దొడ్లేరు సిజిజిబి బ్రాంచ్‌లో బంగారం కనబడ కుండా పోయిందని 498 అర్జీలు ఇచ్చా రని, అందులో మొదటి దశలో రెన్యువల్‌ చేసే సందర్భంలో గతంలోని రికార్డును ఆధారం చేసుకుని ఎంక్వయిరీ చేసిన 321 మంది ఖాతాదారులకు గ్రాముకు (నికర బంగారానికి) రూ.6,655 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. వారి వివరాలను వారం రోజుల్లో బ్రాంచ్‌ మేనే జర్‌ శివశంకర్‌ రాగానే బ్యాంకులో డిస్‌ప్లే చేసి ఆయా ఖాతాదారులకు నోటీసులు పంపించి నష్టపరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు బంగారం కనబడకుండా పోయిం దని అర్జీలు పెట్టిన ఖాతాదారుల్లో సుమా రు 98 మంది ఖాతాలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదని, వాటిని కూడా రెండవ దశలో పరిశీలిస్తా మని చెప్పారు. వడ్డీ రాయితీ గురించి పై అధికారులతో మాట్లాడతానని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు . అనంతరం ఖాతాదారులతో కలిసి రీజనల్‌ మేనేజర్‌కి బంగారం కనబడకుండా పోయిన రైతులకు వడ్డీ రాయితీ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం క్రోసూరు మండల కార్యదర్శి తిమ్మిశెట్టి హనుమంతరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల ఆంజనేయులు, డి.నటరాజు, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి ముత్యాల పౌలు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూని యన్‌ నాయకులు సుబాని , కోటి,నాగుల్‌ షరీఫ్‌, బి.స్రవంతి బాయి, గన్‌ సైదా , ఎస్‌.ఆంజనేయ నాయక్‌ పాల్గొన్నారు.

➡️