సిద్ధం సభను జయప్రదం చేయాలి : దద్దాల

ప్రజాశక్తి -సిఎస్‌ పురంరూరల్‌ : బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఈనెల 10న నిర్వహిస్తున్న సిద్ధం సభను జయప్రదం చేయాలని వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్‌ కోరారు. స్థానిక కార్యాలయంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొనే సిద్ధం సభకు మండలం నుంచి అధిక సంఖ్య లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేశ్వర్లు, జడ్‌పిటిసి మేకల శ్రీనివాసులు, నాయకులు గుంటక తిరుపతి రెడ్డి, బోనగిరి వెంకటయ్య, బైరెడ్డి తిరుపతి రెడ్డి, దుగ్గిరెడ్డి జయరెడ్డి, షేక్‌ బుజ్జి, బొర్రాజు రమణయ్య, ముడుమాల నారాయణ రెడ్డి, పెరుగు సుబ్బరామయ్య, వాడా లక్ష్మీరెడ్డి, మూరం మొరార్జీ, మేకల బాలు, చల్లా రాఘవులు, షేక్‌ గౌస్‌, అద్దంకి రమణయ్య, పందిళ్ళ యల్లయ్య, అంబాల శేఖర్‌ రెడ్డి, దుద్దుకూరి శ్రీనివాసులు, మితికెల గురవయ్య, పెద్దన్న, పందిటి వెంగలరావు, అటేలయ్య, ఆంథోని, చీర్లదిన్నె లక్ష్మీ నారాయణ, వసంత కుమార్‌, దేవరాజ్‌, మిరియం వెంకటేశ్వర్లు, కటికల వెంకటరత్నం పాల్గొన్నారు.

➡️