సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

Mar 21,2024 20:46

ప్రజాశక్తి -గరుగుబిల్లి : బిజెపి, టిడిపి, వైసిపి అభ్యర్థులను ఓడించి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం గరుగుబిల్లి మండల కేంద్రంలో సిపిఎం కార్యకర్తల సమావేశం బివి రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ఆవలంభిస్తున్న విధానాలు దేశ ప్రజల ఆర్థిక, సామాజిక భద్రతకు తీవ్ర నష్టం చేకూర్చుతున్నప్పటికీ రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి బిజెపిని వ్యతిరేకించకపోగా, బలపరచడం, జట్టు కట్టడం సిగ్గుచేటని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే మూడు వ్యవసాయ చట్టాలను, కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్‌ కోడ్లను బిజెపి తీసుకొస్తే టిడిపి, వైసీపీలు బలపర్చాయన్నారు. అందువల్ల బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా ఉన్న టిడిపి, వైసిపిలను ఓడించి ప్రజల తరఫున నికరంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మండంగి రమణ, వై.మన్మధరావు, సుంకి గ్రామపంచాయతీ సర్పంచ్‌ కరణం రవీంద్ర, కలిశెట్టి జగ్గారావు, గిరిజన సంఘం నాయకులు బిడ్డిక అడిత్తు తదితరులు పాల్గొన్నారు.

➡️