‘సూపర్‌ సిక్స్‌’పై గ్రామాల్లో ప్రచారం

Feb 18,2024 21:33

ప్రజాశక్తి – కురుపాం : ప్రజల భవిష్యత్తుకు భరోసా కావాలంటే చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలతోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలోని గుజ్జువాయి పంచాయతీలో గల డి.కొత్తగూడ, ఎన్‌.కొత్తగూడ, ఎగువ కొత్తగూడ, గోర్జంగూడ, బుగన్నగూడ గ్రామాల్లో మండల కన్వీనర్‌ కెవి కొండయ్య ఆధ్వర్యంలో జరిగి వంటి సూపర్‌ సిక్స్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జులు నాగేశ్వరరావు, గుడారి వెంకటరమణ, బిడ్డిక కడాయి, మాజీ సర్పంచ్‌ సుబ్బలక్ష్మి, నాయకులు కె.మల్లేసు, బి.బాలరాజు, వెంకటరమణ, గవరయ్య, గౌరి, భాస్కరరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ :టిడిపి అధికారంలోకి తీసుకువస్తే సూపర్‌ సిక్స్‌ వంటి పథకాలతో రాష్ట్రంలో పేదరికం రూపుమాపేందుకు కృషి చేస్తామని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజరు చంద్ర అన్నారు. పట్టణంలోని కొత్తవలస ఐదో వార్డులో ఆదివారం నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన స్థానిక కార్యకర్తలు, నాయకులతో కలిసి వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మహాలక్ష్మి ఉచిత గ్యాస్‌, నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి, పట్టణ టిడిపి అధ్యక్షుడు రవికుమార్‌, కౌన్సిలర్లు కోల మధు సరిత, నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, వారణాసి నాగేశ్వరరావు బుడితి శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.టిడిపిలోకి 50 కుటుంబాలు చేరికభామిని : వైసిపి పాలనతో విసుగు చెందిన 50 కుటుంబాలు టిడిపి లోకి చేరాయని పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ తెలిపారు. బాలేరులో వలురౌతు బల్లన్న ఆధ్వర్యంలో వైసిపికి చెందిన 50 కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. వీరిని జయకృష్ణ టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమం టిడిపి ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, మండలం అధ్యక్షులు బోగాపురపు రవినాయుడు, మాజీ ఎంపిపి భూపతి ఆనందరావు, టిడిపి మండలి కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️