సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల సాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను జడ్పిటిసి దుంపా రమణమ్మ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌కు మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మొత్తం 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో వ్యక్తిగతంగా ప్రథమ స్థాయిలో సంతనూతలపాడు హైస్కూల్‌ విద్యార్థి టీ మధుకిరణ్‌ నాయుడు, ద్వితీయ స్థాయిలో మంగమూరు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థి సాత్విక్‌, తతీయ స్థాయిలో కొనగానివారిపాలెం హైస్కూల్‌ విద్యార్థిని సిహెచ్‌ వైష్ణవి నిలిచారు. గ్రూపుల వారీగా ప్రథమ స్థానంలో సంతనూతల హైస్కూలు విద్యార్థుల టీం, ద్వితీయ స్థానంలో మంగమూరు హైస్కూల్‌ విద్యార్థుల టీం, తృతీయ స్థానంలో సంతనూతలపాడు హైస్కూల్‌ విద్యార్థుల టీము నిలిచింది. అనంతరం విజేతలకు డిప్యూటీ డిఇఓ అనీతారోజ్‌ రాణి, ఎంఈఓ-1 చంద్రమౌళేశ్వరరావు, ఎంఈఓ-2 వెంకారెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

➡️