సోనియా ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం

ప్రజాశక్తి-కనిగిరి: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పిసిసి సభ్యులు పిల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఆయన కేక్‌ కటింగ్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మాజీ ప్రధాని కోడలు మరియొక ప్రధాని భార్య ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు అయిన సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు యువ నాయకుడు రాహుల్‌ గాంధీ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో వలె ఆంధ్రాలో కూడా ప్రజల ఆకాంక్ష నెరవేరేలా ప్రజా సంక్షేమం కోరే కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని ఆయన పేర్కొన్నారు. సోనియాగాంధీ మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారని, ప్రజల కష్టాలు తీరుస్తారని తెలిపారు. సోనియా సారథ్యంలో దేశం సుభిక్షంగా అభివృద్ధి వైపు అడుగులు ముందుకు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు సంగటి మల్లికార్జునరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బలసాని కోటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు రమణయ్య, కాంగ్రెస్‌ పార్టీ శ్రేయోభిలాషులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️