సోమేపల్లి వెంకటసుబ్బయ్యకు ఘన నివాళులు

చేను చెక్కిన శిల్పాలు పుస్తకం ఆవిష్కరిస్తున్న ఎంపి కృష్ణదేవరాయలు, సాహితీవేత్తలు, కుటుంబ సభ్యులు
ప్రజాశక్తి-గుంటూరు : తెలుగు సాహిత్య రంగంలో కవిగా, గుంటూరు జిల్లా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులుగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. సోమేపల్లి సంస్మరణ కార్యక్రమం ఆదివారం ఎస్‌.వి.యన్‌ కాలనీలోని చిన్మయ ఫంక్షన్‌ హాల్లో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సోమేపల్లి వెంకటసు బ్బయ్య ‘చేను చెక్కిన శిల్పాలు’ హిందీ అనువాద పుస్తకాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకష్ణ దేవరాయలు, ఆంధ్రప్రదేశ్‌ గ్రంథా లయ పరిషత్‌ ఛైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, డాక్టర్‌ వెన్నా వల్లభరావు ఆవిష్కరించారు. చలపాక ప్రకాష్‌ రచించిన ‘అప్పగింతలు’ కథా సంపుటిని డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, పెనుగొండ లక్ష్మీనారాయణ, చిల్లర భవానిదేవి ఆవిష్కరించి సోమేపల్లికి అంకితం ఇచ్చారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యద ర్శులు గుత్తికొండ సుబ్బారావు, జి.వి.పూర్ణ చందు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, విరసం నాయకులు రుక్మిణి, నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎ.జయప్రకాష్‌, సాహితీ వేత్తలు భూసురుపల్లి వెంకటేశ్వర్లు, బీరం సుందరరావు, గుమ్మా సాంబశివరావు, రావెల సాంబశివరావు, కందిమళ్ల సాంబశివ రావు తదితరులు సభలో పాల్గొని సోమేపల్లితో తమకు గల సాహితీ స్మృతులను నెమరు వేసుకున్నారు. తొలుత వెంకటసుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమాన్ని సోమేపల్లి వెంకటసుబ్బయ్య కుమారులు, సభ్యులు వశిష్ట, విశ్వనాథ విరించి, బంధువులు తోటకూర వెంకట నారాయణ, మానుకొండ ఉపేంద్ర, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం సభ్యులు చలపాక ప్రకాష్‌, ఎస్‌.ఎం.సుభాని, బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, నానా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి సాహితీవేత్తలు, బంధు మిత్రులు పాల్గొన్నారు. రెవెన్యూ, జెడ్పీ అధికారులు, అనధికారులు పాల్గొని విధి నిర్వహణలో వారి నిజాయితీని కొనియాడారు.

➡️