స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ బడ్జెట్‌కు మహాజన సభ ఆమోదం

స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ

ప్రజశక్తి-ఉక్కునగరం :విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ 59వ మహాజనసభ బుధవారం స్టీల్‌క్లబ్‌ ఆడిటోరియంలో జరిగింది. సొసైటీ ఉపాధ్యక్షుడు కె.ఆనంద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన మహాసభలో ముందుగా మరణించిన సభ్యులకు ఎంవి.రమణ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కార్యక్రమంలో కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి నివేదికను మహాజన సభలో ప్రవేశపెట్టారు. 2024-25 బడ్జెట్‌ను డివిఎస్‌ఎన్‌ కొండరాజుప్రవేశపెట్టగా, మహాజనసభ ఆమోదించింది. ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ 37ఏళ్లుగా ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా, సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తూ సంఘం ప్రగతి పథంలో సాగుతోందన్నారు. 12,933 మంది సభ్యులతో రూ. 361 కోట్ల టర్నోవర్‌తో పనిచేస్తోందన్నారు. ప్రతి సంవత్సరం ఆడి వర్గీకరణలో ఏ గ్రేడ్‌ సొసైటీగా నిలిచిందన్నారు.కార్యక్రమంలో డైరెక్టర్‌ కర్రి శ్రీనివాస్‌. మహీధర్‌ వివిధ కార్మిక సంఘాల నాయకులు, పాలకవర్గ మాజీ సభ్యులు, సీనియర్‌ మేనేజర్‌ దామోదర్‌ రెడ్డి పాల్గొన్నారు.

త్రిఫ్ట్‌ సొసైటీ మహాజనసభలో మాట్లాడుతున్న ఉపాధ్యక్షుదు ఆనంద్‌ కుమార్‌

➡️