ప్లాస్టిక్ వినియోగం మానవ మనుగడకే ప్రమాదం

Apr 27,2024 17:09 #college, #vijayanagaram
  • గిరిజన యూనివర్సిటీ వైస్ చైర్మన్ కట్టమని

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిటియు లో ప్లానెట్ వెర్సస్ ప్లాస్టిక్ పై సదస్సు గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు రాబోయే కొద్దికాలంలో నీటి సంక్షోభాన్ని సృష్టించవచ్చునాని దీని కారణంగా భూమిపై ప్రజలమధ్య అంతర్గత యుద్ధాలు మరియు సంఘర్షణలకు దారితీసి అవకాశం ఉందని అలాగే భూమి మీద ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు ఎక్కువవుతోంది దీని వల్ల పర్యావరణం చాలా విపత్కర పరిస్తుతులు ఎదుర్కోవలసివస్తుందని, ఇది భూమిపై మానవ మనుగడకు సవాలు విసురుతోందని దీనిని నివారించడానికి విచక్షణ, విలువల తో కూడిన ప్రవర్తన, జీవన శైలి మార్పు అవసరమనివైస్-ఛాన్సలర్ ప్రొ. వి.కట్టమని పిలుపునిచ్చారు.శనివారం సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2024 థీమ్ అయిన “ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్” అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. రాఘవేంద్ర పి.తివారి మాట్లాడుతూపురుగుమందులు మరియు రసాయనిక ఎరువులు వాడటం వలన లిథోస్పియర్, హైడ్రోస్పియర్ మరియు అట్మాస్పియర్ నాణ్యత దెబ్బతింటుందని నేల, గాలి, నీటి నాణ్యతను కాపాడేందుకు భవిష్యత్ తరాలకు అందించేటందుకు ప్రజలు ప్రయత్నించాలని కాలుష్యం నివారించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు పునరుద్ధరణ కోసం విద్యార్థుల కృషి చెయ్యాలని తెలిపారు. హెచ్.ఓ.డి. జియాలజీ, డా.సురేష్ బాబు.కె, డా.ప్రసాద్ మన్నాల సమావేశాన్ని ఏర్పాటు చేయగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, డీన్ ప్రొఫెసర్ శరత్చంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.బి.కివడే, డా.పి.శ్రీదేవి, డా.బి.కోటయ్య , డా.ఎల్.వి.అప్పాసాబ, ఇతర అధ్యాపకులు, నాన్ టీచింగ్ మరియు వివిధ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

➡️