స్థలాలు ఇచ్చే వరకూ భూపోరాటం

ప్రజాశక్తి- గోపవరం బద్వేల్‌ మండలంలోని అర్హులైన పేద లందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేవరకు భూపోరాటం కొనసాగుతుందని, పేదల ఇంటి స్థలాల కోసం బుధవారం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం బద్వేల్‌ మండలం సి.కొత్తపల్లి రెవెన్యూ పొలంలో కొనసాగుతున్న భూపోరాటాన్ని పరిశీలించారు. అనంతరం వారు పేదలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా పేదవాడు జానడు జాగా కోసం పోరాటం చేయాల్సి వస్తుందంటే ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. బద్వేల్‌ మండలంలో వందలాదిమంది ఇంటి స్థలం లేని పేదలు బాడుగ ఇండ్లలో జీవిస్తున్నారని వాపో యారు. పట్టణానికి సమీపంలో పెద్ద ఎత్తున ప్రభు త్వ భూములు ఉన్నప్పటికీ జగనన్న కాలనీల పేరుతో పేదలను ప్రభుత్వం పట్టణానికి దూరంగా తరమటం దుర్మార్గమని పేర్కొన్నారు. పేదలకు దక్కాల్సిన భూములను భూకబ్జా దారులకు కట్టబెట్టడం కోసమే ప్రభుత్వ అధికారులు కుమ్మక్క య్యారని వారు ఆరోపించారు. మండలంలోని అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసే వరకూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి పేదలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు రమణ, ఓబులేసు, రాంబాబు, రామసుబ్బమ్మ, దుర్గమ్మ పాల్గొన్నారు,

➡️