స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతి

Dec 11,2023 20:17

ప్రజాశక్తి-అనంతపురంకార్పొరేషన్‌ : నగరంలోని 49వ డివిజన్లో అతివేగంతో వాహనదారుల రావడంతో ప్రమాదాల జరుగుతున్నాయని స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ భాగ్యలక్ష్మికి కార్పొరేటర్‌ మునిశేఖర్‌ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 49 వ డివిజన్‌ వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తూ పసి పిల్లలను కరుస్తున్నాయని.. వీధులలో వెళ్లే వాహనదారులను వెంటపడి గాయ పరుస్తున్నాయని తెలిపారు. వీధి కుక్కల బెడద తప్పించాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే స్పీడ్‌ బ్రేకర్స్‌ లేనందున వాహనదారులు మితిమీరిన వేగంతో పయణిస్తున్నారని తెలిపారు. దీంతో చిన్న పిల్లలకు, మహిళలకు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే వివిధ కూడళ్లలో ప్రజలకు, వృద్దులకు సేద తీరడానికి సిమెంటు బెంచీలను మంజూరు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.

➡️