జిఒ 3కు చట్టబద్ధత కల్పించాలి

Jun 28,2024 21:46

పాచిపెంట: ఏజెన్సీ ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని, జిఒ 3కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని కుడుమూరు- మెట్టవలస జంక్షన్‌ వద్ద శుక్రవారం గిరిజనులు కరపత్రం విడుదల చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం మండల సహాయ కార్యదర్శి కొర్ర కల్యాణ్‌, ఉపాధ్యక్షులు సుకురు ఎర్రయ్య మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు గత ప్రభుత్వం చేసిన అన్యాయం ప్రస్తుతం కొత్త ప్రభుత్వం చేయొద్దన్నారు. ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు జీవో 3కు చట్టబద్ధత కల్పిస్తూ ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేస్తారని ఎంతో ఆశతో ఆదివాసీ నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా తీవ్రం అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వమైనా జిఒ 3కు చట్ట బద్దత కల్పించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కొర్ర అర్జున్‌, శివ, సోను గిన్నెల పోతయ్య, గోపాల్‌ సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️