హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

ప్రజాశక్తి- శృంగవరపుకోట : వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు జి. ఈరన్న తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కన్జుమర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవానికి ప్రిన్సిపాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌ కేశవ రావు మాట్లాడుతూ వస్తువు కొనుగోలు చేసిన వినియోగదారులు ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలన్నారు. దీని ద్వారా బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వలీఖాన్‌, ఆర్‌. శ్రీలక్ష్మి, అప్పలరాజు, డి. హైమవతి, సురేష్‌, ప్రసాద్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️