హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

చిలకలూరిపేట: చట్టాల పట్ల అవగాహనతోనే హక్కు ల పరిరక్షణ సాధ్యమౌతుందని హ్యూ మన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ వ్యవ స్థాపక అధ్యక్షులు డాక్టర్‌ బొడ్డు పాటి దాసు తెలిపారు. హ్యూమన్‌రైట్స్‌ ఫౌండేషన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షుడు అడపా అశోక్‌ అధ్యక్షతన స్థానిక కెమిస్ట్‌ అండ్‌ డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ హాలులో బుధవారం మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అశోక్‌ మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులకు అనేక హక్కు లను కల్పిం చిందని, ఆయా హక్కులపై ప్రాధమిక అవగ ాహన కలిగి ఉండాలని వివ రించారు. చైతన్యవంతమైన సమాజం ఉన్నప్పుడే హక్కుల పరిరక్షణ సాధ్య మౌతుందన్నారు. పౌరహక్కులను హరించి వేస్తు న్నారని, వీటిని సంఘటితంగా ప్రశ్నించాలని అన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడంతో అనేక విధాలుగా మోస పోతున్నారని చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు 1986లోనే తీ సుకువచ్చిన ప్రత్యేక చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వం 2019 లో వినియోగదారుల వివా దాల పరిష్కార కమిషన్‌ పేరుతో కొత్త చట్టాన్ని రూపొందించిందని, వినియోగదారులకు అతి తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందించ డమే ఈ చట్టం ముఖ్యఉద్దేశమని, కానీ దీనిపై అవగాహన లేకపోవడంతో న్యాయం పొందలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఆయన బాలల హక్కులు, మహిళ చట్టాలు, వినియోగదారుల చట్టం త దితర చట్టాలపై అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిలకలూ రిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.రాధాకృష్ణ, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం, వైసిపి నాయకులు నాయుడు వాసు, గుంజి వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురికొండ మల్లిబాబు, ఏవైఏఎఫ్‌ పల్నాడు జిల్లా ఇన్‌చార్జి షేక్‌ సుబాని హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్‌ దరియావలి, సీ నియర్‌ పాత్రికేయులు షేక్‌ జబ్బార్‌, సంస్థ ఖమ్మం జిల్లా జనరల్‌ సెక్రెటరీ మంచు కిరణ్‌ కుమార్‌,ఏపీ అధ్యక్షు రాలు షేక్‌ సిద్దంబి, ప్రోగ్రాం కన్వీనర్‌ షేక్‌ రజియా తదితరులు పాల్గొన్నారు.

➡️