హామీల అమలు కోసం రాజీలేని పోరాటం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ మున్సిపల్‌ కార్మికులు హామీల అమలు కోసం రాజీలేని పోరాటాలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడ రేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. మోకాళ్లపై నిల్చుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో దేశ ప్రజలను కాపాడింది పారిశుధ్య కార్మికులేనని తెలిపారు. జాతీయ కార్మిక లేబర్‌ కమిషన్‌ నేటి ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని తెలిపారు. కార్మికులు ఆరు నెలల కాలం వరస క్రమంలో ప్రభుత్వ రంగ, ప్రభుత్వ అనుబంధంగా ఉన్న సంస్థల్లో పని చేస్తే వారిని పర్మినెంట్‌ చేయా లని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడం వెట్టి చాకిరీ కిందికి వస్తుందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఉలుకు పలుకు లేకుండా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల ఓట్లతో ఎన్నుకున్న ప్రభుత్వాలు, ఎన్నికైన పాలకులు దీనిని విస్మరించి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 2024 జరగ బోవు ఎన్నికల్లో ప్రజలు, కార్మికులు కలిసి బిజెపిని, వైసిపిని గద్దె దించుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామ్మోహన్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి, సిఐటియు నాయకులు గోపి, ఎపి మున్సి పల్‌ నాయకులు ఎస్‌.రవి, పారిశుధ్య కార్మికులు, ఇంజినీరింగ్‌ రంగంలో పనిచేసే కార్మికులు పాల్గొన్నారు. టిడిపి సీనియర్‌ నాయకుడు లక్ష్మిరెడ్డి, కడప నియోజకవర్గం మాజీ ఇన్‌ఛార్జి వి.ఎస్‌.అమీర్‌ బాబు, నాయకులు ఓబుల్‌రెడ్డి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బద్వేలు : ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్స్‌ను పరిష్కారం చేసే దిశగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు చిన్ని అన్నారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెను ఉధతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండల నాయకులు పొదిలి కదిరయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు ఇరుపోతు ఓబులేసు, పట్టణ నాయకులు రాజగోపాల్‌, కెవిపిఎస్‌ పట్టణ నాయకులు సగిలి రాయప్ప, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు మేడ గౌతమి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంప అనంతమ్మ, రత్తమ్మ, నాయకులు మోక్షమ్మ, బాలమ్మ, మస్తాన్‌ బీ, రామలక్ష్మమ్మ, డివైఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు షేక్‌ ఆదిల్‌, జీవి రమణారెడ్డి, చేతివత్తిదారుల సంఘం నాయకులు గంప సుబ్బరాయుడు మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు పులి శ్యాంప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు దియ్యాలహరి, ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, కోశాధికారి కాలువ శివకుమార్‌, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు బద్వేల్‌ ప్రవీణ్‌ కుమార్‌, నాగరపు సత్యరాజు, నేలటూరు పాలయ్య, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్‌, పద్మిశెట్టి రామయ్య, తేళ్ల కిరణ్‌, పాతర పెంచల వరప్రసాద్‌ పాల్గొన్నారు. మైదుకూరు: ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఆధ్వర్యంలో మైదుకూరులో కార్మికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు కోశాధికారి జి.చిన్న, లక్ష్మయ్య, శేఖర్‌, వెంకటసుబ్బయ్య, పుల్లమ్మ, విశ్వనాథం, చిన్న రాముడు, నాగయ్య, పాపారాయుడ, ఓబులమ్మ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : మున్సిపల్‌ కార్మికులు చేసే పనిని పోలిస్తే ప్రభుత్వం వారికి ఎంత చేసిన తక్కువే అని, వీరి న్యాయమైన కోర్కెలు వైసిపి ప్రభుత్వం తీర్చని పక్షంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడుతూ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేయడం బాధాకరమన్నారు. వీరి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘ గౌరవాధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి సాల్మన్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి విజయకుమార్‌, ఎన్‌.కొండారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు వెంకట కొండయ్య, వద్ది బాలుడు, తప్ప మహబూబాషా, టిడిపి నాయకులు గంటా వెంకటేశ్వర్లు, ఖలీల్‌బాషా, తెలుగు యువత అధ్యక్షుడు నల్లబోతుల నాగరాజు, కార్మిక సంఘం అధ్యక్షుడు చంటి, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, ప్రమీలమ్మ, గుర్రమ్మ, నీతక్క, రమాదేవి, శాంతి, మరియమ్మ, నరసమ్మ, మోహన్‌, ఓబులేసు, ఉబయ్య, సురేష్‌, జాకోబు పాల్గొన్నారు.

➡️