10న మహాసభను జయప్రదం చేయండి

 వినుకొండ: నియోజవర్గంలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు, వినుకొండ పుర పాలక సంఘం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యో గులను గురువారం జేఏసీ అమరావతి, పల్నాడు జిల్లా చైర్మన్‌ పృథ్విరాజు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన రాష్ట్ర ఔట్‌ సోర్సింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రథమ బహిరంగ సభ డిసెంబర్‌ 10వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో జరగ నుందని చెప్పారు. తమ నియోజకవర్గ వర్గం నుండి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, ప్రతి ఉద్యోగికి హెచ్‌ఆర్‌ఎ అమలు జరపాలని, ప్రభుత్వ సం క్షేమ పథ కాలు తమకు కూడా వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం అంద జేయాలని, తదితర డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరగబోయే ఈ మహాసభను ప్రతి ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు హాజరు కావాల్సిందిగా కోరారు. విజయపురిసౌత్‌: ఈ నెల 10వ తేదీన విజయ వాడలో జరిగే రాష్ట్ర స్థాయి ఔట్సో ర్సింగ్‌ ఉద్యోగుల మహాసభను ఔట్సో ర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు జయ ప్రదం చేయాలని పల్నాడు జిల్లా హౌసింగ్‌ డిపార్ట్మెంట్‌ అవుట్సోర్సింగ్‌ ఉద్యోగుల అధ్యక్షులు సాతులూరి మరియ దాసు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు పదో తారీకు జరగబోయే సభకు భారీ ఎత్తున హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.

➡️