10 పోలింగ్‌ కేంద్రాలు మార్పు

Feb 5,2024 21:58
రాజకీయ పార్టీల ప్రతినిధులనుద్ధేశించి మాట్లాడుతున్న కలెక్టర్‌

రాజకీయ పార్టీల ప్రతినిధులనుద్ధేశించి మాట్లాడుతున్న కలెక్టర్‌
10 పోలింగ్‌ కేంద్రాలు మార్పు
నెల్లూరు :ఓటర్ల సౌకర్యార్థం జిల్లాలోని 10 పోలీస్‌ కేంద్రాలను మార్పు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ తన ఛాంబరులో రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు.కలెక్టర్‌ హరి నారాయణన్‌ మాట్లాడుతూ శిధిలమైన భవనాల్లో ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో రెండు పోలింగ్‌ కేంద్రాలు, కోవూరు నియోజ కవర్గంలో ఒక పోలింగ్‌ కేంద్రం, నెల్లూరు రూరల్లో రెండు పోలింగ్‌ కేంద్రాలు, సర్వేపల్లిలో 3 పోలింగ్‌ కేంద్రాలు, ఉదయగిరి నియోజ కవర్గంలో రెండు పోలింగ్‌ కేంద్రాలు మొత్తం 10 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించి అన్ని వసతులు గల సమీపంలోని ప్రభుత్వ భవనాల్లోకి మార్పు చేసేందుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అంగీకారం తెలిపారు. డిఆర్‌ఓ లవన్న, ట్రైనీ కలెక్టర్‌ సంజన సింహ, వైసిపి నుండి వై మురళీధర్‌ రెడ్డి, సురేంద్రబాబు టిడిపి నుంచి ఎస్కే రసూల్‌, జలదంకి సుధాకర్‌, శివకుమార్‌ బిజెపి నుంచి బి శ్రీనివాసులు, కాంగ్రెస్‌ నుంచి ఎ బాల సుధాకర్‌, బిఎస్‌పి నుంచి శ్రీరామ్‌ పాల్గొన్నారు.

➡️