పార్లమెంటుకు10, అసెంబ్లీకి 25

Apr 25,2024 21:10

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో పార్లమెంటుకు పది, శాసన సభకు ఎనిమిది నామినేషన్లు గురువారం దాఖలయ్యాయి. అరకు పార్లమెంటు నియోజక వర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా హేమనాయక్‌ వడితే, మండల గిరిధర రావు, అతిధి, సమారెడ్డి బాలకష్ణ, రొబ్బా నానిబాబు, ఉర్లాక త్రినాథ ఒక్కొక్క సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయగా, లకే అశోక్‌కుమార్‌ రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. భారత ఆదివాసీ పార్టీ అభ్యర్థిగా మొట్టడం రాజ బాబు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా అతిధి, బిజెపి అభ్యర్థి తరపున ఒక్కొక్క సెట్‌ నామినేషన్‌ పత్రాలను అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నిశాంత్‌ కుమార్‌ కు దాఖలు చేసారు.పార్వతీపురం అసెంబ్లీ నియోజక వర్గంలో జై భీమ్‌ రావు పార్టీ అభ్యర్థిగా గుంట జ్యోతి ఒక సెట్‌, వైసిపి అభ్యర్థిగా అలజంగి జోగారావు తరపున ఒక సెట్‌, టిడిపి తరపున బోనెల విజయ చంద్ర ఒక సెట్‌, ఇదే పార్టీకి చెందిన కాతుల అనూష, కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బత్తిన జ్ఞానానందం, బత్తిన మోహన రావు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను, స్వతంత్ర అభ్యర్థిగా పారిశర్ల అప్పారావు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి కె.హేమలతకు సమర్పించారు.కురుపాం : కురుపాం నియోజక వర్గం నుంచి మొత్తం 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు గాను 19 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వివి రమణ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా తాడంగి శ్రీహరిరావు నాయుడు ఒక సెట్‌, టిడిపి అభ్యర్థి టి.జగదీశ్వరి తోయక తరపున మూడవ సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. వైసిపి అభ్యర్దిగా మండంగి సంతోషిక సెట్‌, బిఎస్‌పి అభ్యర్థిగా తాడంగి మిన్నారావు ఒక సెట్‌, వైసిపి అభ్యర్థిగా పి.పుష్ప శ్రీవాణి ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి వివి రమణ కు దాఖలు చేశారు. పాలకొండ : పాలకొండ అసెంబ్లీ వర్గంలో నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జైపాల్‌ కడ్రక ఒక సెట్‌, జాతీయ జనసేనా పార్టీ అభ్యర్థిగా నిమ్మక కృష్ణ ఒక సెట్‌, బిఎస్‌పి అభ్యర్థిగా ఊయక భానుచందర్‌ ఒక సెట్‌, వైసిపి అభ్యర్థిగా విశ్వసరాయి కళావతి ఒక సెట్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కూరంగి కృష్ణారావు ఒక సెట్‌, జనసేన పార్టీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి శుభం బన్సల్‌ కు దాఖలు చేసారు. సాలూరు : సాలూరు శాసన సభ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ రెండు సెట్లు, సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థిగా పూసురు సాయి, వైసిపి అభ్యర్థిగా పీడిక రాజన్న దొర మరో సెట్‌, టిడిపి అభ్యర్థిగా గుమ్మిడి సంధ్యారాణి మరో సెట్‌ నామినేషన్‌ పత్రాలను, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుమ్మిడి పధ్వీ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మువ్వల పుష్పరావు ఒక సెట్‌, బిఎస్‌పి అభ్యర్థిగా మువ్వల జ్ఞానప్రకాష్‌ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణు చరణ్‌కు దాఖలు చేశారు.భారీ ర్యాలీలతో టిడిపి అభ్యర్థుల నామినేషన్‌ పార్వతీపురంటౌన్‌ : పార్వతీపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బోనేల విజయచంద్ర నాయకులు, కార్యకర్తల నడుమ అట్టహాసంగా గురువారం తన నామినేషన్‌ వేశారు. తొలుత స్థానిక పాత బస్టాండ్‌ కూడలి నుండి ప్రధాన రహదారి గుండా కోలాటం, తప్పిట గుళ్లు, డీజే, తీన్మార్‌ డప్పులు, తదితర వాటితో ప్రధాన రహదారి గుండా ఆర్‌డిఒ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.సాలూరు రూరల్‌ : టిడిపి అభ్యర్థిగా గుమ్మిడి సంధ్యారాణి నామినేషన్‌ వేసిన అనంతరం భారీ ర్యాలీ పట్టణంలో నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. మీ అందరి మన్ననలతో ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బోసుబొమ్మ జంక్షన్‌, డీలక్స్‌ సెంటర్‌, కోటదుర్గ కోవెల, డబ్బీ వీధి మీదుగా భారీ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌, సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️