ప్రజాశక్తి-మార్కాపురం మార్కాపురం సమీపంలోని తర్లుపాడు రోడ్డులో గల శ్రీఅల్లూరి పోలేరమ్మ దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి నిర్వహించారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా దాసరి వెంకటేశ్వర్లు, ధర్మకర్త లుగా గరికపాటి అంజమ్మ, మల్లాపురం రోజారాణి, కర్రోల రమణమ్మ, మండ్లా వెంకటరమణి, ఉలాపు శివ ప్రసాద్‌, తుంబేటి వెంకటకాశయ్యతో పాటు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా అర్చకులు ఆవుల వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం దాసరి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం నూతన కమిటీని పలువురు అభినందించారు.

➡️