అక్రమంగా నిల్వ ఉంచిన120 కేసుల మద్యం స్వాధీనం

పట్టబడిన మద్యం బ్యాక్స్‌లు ఇవే...

ప్రజాశక్తి-చోడవరం :

చోడవరం మండలం నర్సాపురం రెవెన్యూ దుడ్డుపాలెం బస్టాప్‌ వెనుక ఇటుక బట్టీ పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 120 కేసుల మద్యాన్ని ప్లయింగ్‌ స్క్వాడ్‌ పట్టుకుంది. సిఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం… ముందుగా అందిన సమాచారం మేరకు ప్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ నెంబర్‌-4 బి.సత్యంనాయుడు ఆధ్వర్యంలో దుడ్డుపాలెం బస్టాప్‌ వెనుక ఉన్న ఇటుకుల బట్టీ పాకలో తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 120 మద్యం బాక్సులు, విడిగా గోనెసంచిలో ఉన్న 78, మొత్తంగా 5,833 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల బట్టీ యజమాని కడిమి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని స్థానిక సిఐ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మద్యాన్ని గోవా రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని చెప్పారు.

➡️