16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

క్రోసూరు: ఆల్‌ ఇండియా సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆమంచి విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతు సం ఘం మండల కార్యదర్శి తిమ్మిశెట్టి హను మంతరావు అధ్యక్షతన శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా రైతు సంఘం జిల్లా ఉపా ధ్యక్షులు ఆవుల ఆంజనేయులు మాట్లా డుతూ భూ హక్కుల చట్టం 27/23 ఉప సంహరించుకొని చుక్కల భూములు, బంజర భూములన్నింటికి పట్టాలు కూడా ఇవ్వాలని, అటవీ హక్కుల చట్ట సవరణను ఉపసంహరించుకొని, ఆదివాసీల హక్కు లు కాపాడాలని , సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఏపూరి వెంకటేశ్వర్లు మాట్లాడారు.సమావేశంలో రైతు సంఘం డివిజన్‌ అధ్యక్షులు కంచేటి పెద్దబ్బాయి, సిఐటియు క్రోసూరు మండల కార్యదర్శి గర్నేపూడి మహేష్‌, రైతు సంఘం అచ్చం పేట మండల కార్యదర్శి రావెళ్ల వెంక టేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు షేక్‌ ముస్తఫా, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఇశ్రాయేలు , ఆటో యూనియన్‌ నాయకులు జగన్నాథం ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు పి.అశోక్‌ పాల్గొన్నారు.

➡️