20రోజుల్లో రోడ్ల నిర్మాణాల పూర్తి

సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు

సిపిఎం జెడ్‌పిటిసి ఫిర్యాదుపై అధికారుల స్పందన

ప్రజాశక్తి- అనంతగిరి : రోడ్డు నిర్మాణాల్లో అక్రమాలు, అవకవతవకలుపై అధికారులు స్పందించారు. మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో మూడు రోజుల క్రితం పర్యటించిన జెడ్‌పిటిసి దీసరి గంగరాజు, ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణాల్లో అవకతవకలు, నిధులు దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన గిరిజన సంక్షేమ ఎఇఇ గణేష్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ శివ, సంబంధిత కాంట్రాక్టర్లుతోపాటు సిపిఎం నేతల బృందం మంగళవారం మాలింగవలస, పాతకోట, రేగం, నందిగుమ్మి, మద్దిగరువు, పివిటిజి గ్రామాలైన తేనెపట్టు, తెలరపాడులలో సందర్శించి పరిశీలించారు. రోడ్లు నిర్మాణాల్లో లోపాలను అంగీకరించిన సంబంధిత అధికారులు, 15 నుంచి 20రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. పర్యటనలో అనంతగిరి సిపిఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, స్దానిక వైస్‌సర్పంచ్‌ పాంగి అర్జున్‌, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు నరాజీ సురేష్‌ బాబు, రేగం తేనెపుట్టు గ్రామస్తులు సోమేల ధర్మనాయుడు, సోమెల రాంబాబు, ధర్మ, రామమూర్తి, గురుమూర్తి, వాలంటీర్‌ ఎస్‌.ఆనంద్‌, సద్దు గెమ్మేల దాసు, గెమ్మేల.సోమన్న, బురిడీ రమేష్‌, అప్పారావు, దేముడు, పండన్న పాల్గొన్నారు

సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు

➡️